rana: సైడ్ క్యారెక్టర్లు చేయవద్దన్న నెటిజన్ కు దీటైన సమాధానం ఇచ్చిన రానా!

  • ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు పాత్రను పోషిస్తున్న రానా
  • సైడ్ క్యారెక్టర్లు చేయవద్దని సూచించిన నెటిజన్
  • ఈ సినిమాలో చిన్న పాత్ర చేయడం కూడా గొప్పే అన్న రానా

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న బయోపిక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య, దర్శకుడు క్రిష్ లతో కలసి నిన్న చంద్రబాబును రానా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య, క్రిష్ లతో కలసి ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియా ద్వారా రానా పంచుకున్నాడు. ఈ ఫొటోపై ఓ నెటిజన్ స్పందిస్తూ, 'సైడ్ క్యారెక్టర్లు చేయకండి రానా గారూ' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రానా దీటైన సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ సినిమాలో ఓ చిన్న పాత్ర చేయడం కూడా గొప్ప విషయమేనంటూ రిప్లై ఇచ్చాడు. 

More Telugu News