Virat Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ!

  • కోహ్లీ ఖాతాలో 22 టెస్టు సెంచరీలు
  • 113 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఫీట్
  • 22 సెంచరీలకు 114 ఇన్నింగ్స్ తీసుకున్న సచిన్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ ఖాతాలో ఉన్న మరో రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ తో బర్మింగ్ హామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టుల్లో 22 సెంచరీలను కోహ్లీ చేసినట్టు అయింది.

తన కెరీర్ లో 22 టెస్టు సెంచరీలకు 114 ఇన్నింగ్స్ లను సచిన్ తీసుకోగా, 113వ ఇన్నింగ్స్ లోనే కోహ్లీ 22 సెంచరీలు సాధించాడు. దీంతో అత్యంత వేగంగా ఈ ఫీట్ చేరుకున్న ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లలో కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచినట్లయింది. ఇదే సమయంలో ఇంగ్లండ్ పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన 13వ ఇండియన్ క్రికెటర్ గానూ కోహ్లీ నిలిచాడు.

ఇక 22 టెస్టు సెంచరీలను వేగంగా సాధించిన వారి జాబితాలో తొలి స్థానంలో సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ (58 ఇన్నింగ్స్) ఉండగా, ఆయన తరువాత గవాస్కర్ (101 ఇన్నింగ్స్), స్టీవ్ స్మిత్ (108 ఇన్నింగ్స్), కోహ్లీ (113 ఇన్నింగ్స్), సచిన్ (114 ఇన్నింగ్స్)తో ఉన్నారు.

More Telugu News