sensex: దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

  • రెండు రోజుల నష్టాలకు బ్రేక్
  • 391 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 11,361 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ

వరుసగా రెండు సెషన్లలో నష్టాలను చవి చూసిన మార్కెట్లు నేడు దూసుకుపోయాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడంతో ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్ల బాట పట్టారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 37,556కు ఎగబాకింది. నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 11,361కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ (14.50%), వీఐపీ ఇండస్ట్రీస్ (8.13%), డెల్టా కార్ప్ (8.05%), కమిన్స్ ఇండియా (7.27%), ట్రైడెంట్ లిమిటెడ్ (7.10%).

టాప్ లూజర్స్:
జెట్ ఎయిర్ వేస్ (-7.00%), నెస్లే (-4.11%), చైన్నై పెట్రోలియం కార్పొరేషన్ (-3.69%), ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (-3.11%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (-3.02%).     

More Telugu News