raana: క్రిష్ .. బాలకృష్ణలతో రానా సెల్ఫీ!

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్ 
  • చంద్రబాబు నాయుడి పాత్రలో రానా 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు    

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగులో బిజీగా వున్నాడు. సంక్రాంతికి విడుదల కావలసిందేననే ఉద్దేశంతో బాలకృష్ణ ఉండటంతో, క్రిష్ చకచకా కానిచ్చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన బాలకృష్ణ .. విద్యాబాలన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించాడు. రానా ఈ షూటింగులో జాయిన్ కానున్నాడనీ .. చంద్రబాబునాయుడు పాత్రను ఆయన పోషించనున్నాడనే వార్తలు వచ్చాయి.

 అంతా అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా షూటింగులో రానా జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంలో బాలకృష్ణ .. క్రిష్ తో ఆయన సెల్ఫీ తీసుకున్నాడు. నిజంగానే ఈ సినిమాలో రానా నటించనున్నాడా? అనే ఒక సందేహం నెటిజన్స్ లో ఉండేది. తాజాగా బాలకృష్ణ .. క్రిష్ లతో కలిసి తాను తీసుకున్న సెల్ఫీని రానా పోస్ట్ చేయడంతో ఆ సందేహాలకు తెరపడిపోయింది.   

More Telugu News