ఒకేసారి రెండు చిత్రాలతో పలకరించనున్న సమంత

03-08-2018 Fri 15:34
  • తెలుగు .. తమిళ భాషల్లో 'యూ టర్న్'
  • తమిళంలో శివకార్తికేయన్ తో 'సీమరాజా' 
  • సెప్టెంబర్ 13వ తేదీన రెండు సినిమాలు విడుదల  
ఈ ఏడాదిలో సమంత ఇంతవరకూ ఇటు తెలుగులోనూ .. అటు తమిళంలోను చేసిన సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. ప్రస్తుతం సమంత 'యూ టర్న్' సినిమా చేస్తోంది. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోను విడుదల కానుంది. రెండు భాషల్లోను ఈ సినిమాను సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరిగిపోతున్నాయి.

ఇక తమిళంలో సమంత 'సీమ రాజా' సినిమా చేస్తోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి పొన్ రామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తమిళనాట సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఒకే రోజున సమంత రెండు సినిమాలతో తమిళ ప్రేక్షకులను పలకరించనుందన్నమాట. ఒకేసారి రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి మరి.