Air India: దగ్గరి ప్రయాణంలో నో మీల్స్: ఎయిర్ ఇండియా

  • సమోసాలు, శాండ్ విచ్ ల స్థానంలో కుకీస్, పీనట్స్
  • విమానం బరువు తగ్గి ఇంధనం ఆదా అవుతుందన్న ఉన్నతాధికారి
  • సమోసాలపై ఫిర్యాదులు వస్తుండటం వల్ల కూడా
  • గంట వ్యవధిలో గమ్యస్థానాలకు వెళ్లే విమానాల్లో మాత్రమే

ఎయిర్ ఇండియా విమానాల్లో గంట కన్నా తక్కువ సమయం పట్టే రూట్లలో ఇకపై మీల్స్ అందించరాదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మీల్స్ స్థానంలో ప్యాక్ చేసిన కుకీస్ లేదా పీనట్స్ ను అందిస్తామని సంస్థ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విమానాల్లో ఇప్పటివరకూ మీల్స్ అంటూ సమోసాలు లేదా శాండ్ విచెస్ ను ఏఐ అందిస్తోంది.

"మేమిస్తున్న శాండ్ విచ్ లు, సమోసాలపై కొన్నిసార్లు ఫిర్యాదులు వస్తున్నాయి. తాజా నిర్ణయంతో ఇక ఫిర్యాదులు ఉండవని భావిస్తున్నాము. పీనట్స్ లేదా ప్యాక్ చేసిన కుకీస్ ను విమానం ప్రవేశద్వారం వద్దనే ఉంచుతాం. కావాలని అనుకున్నవారు తీసుకెళ్లవచ్చు. వాటిని విమానంలో తిన్నా, తమతో పాటు తీసుకెళ్లినా మాకు అభ్యంతరం లేదు" అని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సమోసాలతో పోలిస్తే, కుకీస్, పీనట్స్ ఎక్స్ పైరీ తేదీ అధికమని, వీటిని ఫ్రిజ్ లో పెట్టడం లేదా వేడి చేయాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. ఈ నిర్ణయంతో విమానం బరువు కూడా తగ్గి స్వల్పంగానైనా ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. కాగా, గత సంవత్సరం దేశవాళీ విమానాల ఎకానమీ క్లాస్ లో కేవలం శాకాహారాన్ని మాత్రమే అందించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News