Tirumala: తిరుమల భక్తుల కోసం జర్మన్ పందిళ్లు!

  • తిరుమలలో తొలిసారిగా జర్మన్ పందిళ్ల ఏర్పాటు
  • రూ. 9.5 లక్షల వ్యయంతో ఏర్పాటు
  • ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం నిత్యమూ వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాలయం ముందు అధునాతన జర్మన్ పందిళ్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుమలలో ఈ తరహా పందిళ్లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాగా, ఇవి భక్తులను ఆకర్షిస్తున్నాయి.

ఒక్కొక్కటి 80 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, అంతే ఎత్తుతో ఉండేలా రెండు పందిళ్లను రూ. 9.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం వేసవిలో, బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల వేళ మాడ వీధులతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో రేకులతో తాత్కాలిక షెడ్ లను అధికారులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపై వాటిని తిరిగి తొలగిస్తూ ఉండటంతో ఆర్థిక భారం అధికమవుతోందన్న భావనలో ఉన్న టీటీడీ, జర్మన్ పందిళ్లవైపు మొగ్గు చూపింది.

More Telugu News