ntr: ఆలయంలో 'అరవింద సమేత వీర రాఘవ'

  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ 
  • ఈ నెలలోనే టీజర్ రిలీజ్ 
  • వచ్చేనెలలో ట్రైలర్

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణ ప్రాంతంలోని భువనగిరి జిల్లా పరిథిలో జరుగుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఒక గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని అంటున్నారు. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే .. ఈషా రెబ్బా తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో కొనసాగనున్న ఈ కథలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ .. రాయలసీమ యాస ప్రత్యేక ఆకర్షణ కాగలవని అంటున్నారు. ఈ నెల రెండవ వారంలో టీజర్ ను .. వచ్చేనెలలో ట్రైలర్ ను వదలాలనే ఆలోచనలో వున్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.          

More Telugu News