imran khan: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలెవరినీ పిలవడం లేదు.. స్పష్టం చేసిన పీటీఐ

  • ఒక జాతీయ కార్యక్రమంగానే నిర్వహించబోతున్నాం
  • దేశాధ్యక్షుడి నివాసంలో ఈ కార్యక్రమం చాలా సింపుల్ గా జరుగుతుంది
  • ఇమ్రాన్ కు చెందిన మిత్రులు మాత్రమే విదేశాల నుంచి వస్తారు

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని మోదీ సహా పలువురు విదేశీ నేతలను ఆహ్వానిస్తున్నారనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే, విదేశీ నేతలు ఎవరినీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం లేదని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధికార ప్రతినిధి ఫవాద్ ఛౌదరి స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు. దేశాధ్యక్షుడి అధికార నివాసంలో చాలా సింపుల్ గా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

విదేశీ నేతలను ఆహ్వానించకూడదని నిర్ణయించామని... ఒక జాతీయ కార్యక్రమంగానే దీన్ని నిర్వహించబోతున్నామని ఫవాద్ చెప్పారు. ఇమ్రాన్ కు చెందిన కొందరు సన్నిహిత మిత్రులు మాత్రమే విదేశీ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారని తెలిపారు. భారత్ నుంచి ఆహ్వానాలు అందుకున్న వారి జాబితాలో మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూ, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ లు ఉన్నారు. ఈ నెల 11వ తేదీన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. 

More Telugu News