Kiki: అలాంటి ఫీట్లు చేయకండి.. హీరోయిన్ రెజీనాకు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్!

  • 'కికి' చాలెంజ్ స్వీకరించిన రెజీనా
  • నడుస్తున్న కారు దిగి డ్యాన్స్
  • ప్రమాదకరమని చెబుతున్న అధికారులు
  • కఠిన చర్యలు ఉంటాయన్న ట్రాఫిక్ పోలీసులు

సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ అయిన 'కికి' చాలెంజ్ ప్రమాదకరమని చెబుతున్నా, వినని హీరోయిన్ రెజీనా కసాండ్రాను హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ చాలెంజ్ ను స్వీకరించిన రెజీనా, నడుస్తున్న కారు డోర్ తీసుకుని కిందకు దిగి, కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ, కారుతో పాటే నడిచి, తిరిగి కారు ఎక్కింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అయింది. సెలబ్రిటీలు ఇలా ప్రాణాంతకపు పనులు చేస్తే, పలువురు దాన్ని అనుసరిస్తారని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడవచ్చని ట్రాఫిక్ ఏసీపీ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ తరహా పనులు చేయవద్దని రెజీనాను హెచ్చరించారు. హైదరాబాద్ రోడ్లపై 'కికి' చాలెంజ్ స్వీకరిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ చాలెంజ్ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు వస్తాయని తెలిపారు.

More Telugu News