sailaja reddy: ‘శైలజారెడ్డి అల్లుడు’ టీజర్ విడుదల

  • టీజర్ విడుదల చేసిన చిత్రయూనిట్
  • ‘ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ..’ అంటున్న అనూ
  • ‘ఈ పిల్లే ఇలా ఉంటే ..!’ అన్న నాగ చైతన్య

మారుతీ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రం టీజర్ ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రొపోజ్ చెయి.. ఐ లవ్ యూ టూ అని ఏక్సెప్ట్ చేస్తా’ అని నాగచైతన్యతో అనూ ఇమాన్యుయేల్ అనడం, ‘పిల్ల పిట్టల్లా ఇంతే ఉన్నా..’ అంటూ నటుడు రఘుబాబు చెప్పడం ఈ టీజర్ లో ఉన్నాయి.

‘ఈ పిల్లే ఇలా ఉంటే తల్లి ఎలా ఉంటుందో!’ అని నాగ చైతన్య డైలాగ్ అనంతరం, రమ్యకృష్ణ సీరియస్ గా నడుచుకుంటూ వస్తుండటం గమనించవచ్చు. కాగా, ఈ నెల 31న  శైలజారెడ్డి అల్లుడు’  ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్యకు జోడీగా అనూ ఇమాన్యుయేల్ నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు అత్త పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తోంది.

More Telugu News