vh: సోనియా కాళ్లు పట్టుకున్నప్పుడు కేటీఆర్ కు సింహం గుర్తుకు రాలేదా?: వీహెచ్

  • అమ్మవారికి కవిత బోనం ఇస్తే.. అందరూ ఇచ్చినట్టేనా?
  • స్వర్ణలత, శ్యామల చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
  • రైతు రాజయ్యకు సంకెళ్లు ఎందుకు వేశారో డీజీపీ చెప్పాలి

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు కలసి పోటీ చేస్తాయంట, సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నప్పుడు సింహం గుర్తుకు రాలేదా? అంటూ ఎద్దేవా చేశారు. చివరకు పండుగలను కూడా టీఆర్ఎస్ హైజాక్ చేస్తోందని మండిపడ్డారు. అమ్మవారికి కేసీఆర్ కూతురు కవిత బోనం ఇస్తే... అందరూ ఇచ్చినట్టేనా? అని ప్రశ్నించారు. రంగం సందర్భంగా స్వర్ణలత, జోగిని శ్యామల చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.

ఒకవైపు రైతుబంధు పథకం పేరు చెబుతూ, మరోవైపు రైతులకు సంకెళ్లు వేస్తున్నారంటూ వీహెచ్ మండిపడ్డారు. పాస్ బుక్ కావాలని అడిగిన పాపానికి హుజూరాబాద్ లో రైతు రాజయ్యకు సంకెళ్లు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పాపం చేశాడని అతనికి సంకెళ్లు వేశారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్... ఏనాడూ రైతులకు సంకెళ్లు వేయలేదని చెప్పారు. 

More Telugu News