China: ఒక్కసారిగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..తృటిలో తప్పించుకున్న తండ్రీకూతుళ్లు!

  • చైనాలోని ఓ ఇంట్లో ఘటన
  • చార్జింగ్ తీసేసినా పేలిన స్కూటర్
  • ప్రమాద తీవ్రతకు హాల్ ధ్వంసం

ఎలక్ట్రానిక్ వస్తువుల్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే వాటికి చార్జింగ్ ఎక్కువైనా, కనెక్షన్ సరిగ్గా లేకపోయినా షార్ట్ సర్క్యూట్ జరిగి పేలిపోతాయి. దీంతో ఏకంగా ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా  చైనాలోని ఓ ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఓ ఇంట్లో తండ్రీకూతుళ్లు తమ పెంపుడు కుక్కతో కలసి టీవీ చూస్తున్నారు. ఇంతలో అక్కడే చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి స్వల్పంగా శబ్దం, పొగ వచ్చాయి. వెంటనే స్పందించిన పాప తండ్రి చార్జింగ్ ను తీసేశాడు. అయినా పొగ, మంటలు తగ్గకపోవడంతో చిన్నారిని తీసుకుని పక్కకు పరిగెత్తాడు.

అనంతరం కొన్ని క్షణాల్లోనే ఆ స్కూటర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాని తీవ్రతకు ఇంటి హాల్ పూర్తిగా ధ్వంసమైంది. కాగా, ఈ ప్రమాదం నుంచి తండ్రీకూతుళ్లతో పాటు కుక్క క్షేమంగా బయటపడింది. ఈ ప్రమాద వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదం చైనాలో ఎక్కడ జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News