Parliament: మీరు చేస్తున్న పనేం బాగోలేదు..!: రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులపై వెంకయ్య మండిపాటు

  • రాజ్యసభను కుదిపేసిన అసోం పౌర గణన
  • తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వెంకయ్య
  • సభ ఆర్డర్ లోకి రాకపోవడంతో వాయిదా

అసోంలో జనగణన, జాతీయ పౌరుల రాష్ట్ర జాబితా విడుదల తరువాత నెలకొన్న గందరగోళం, నిన్న రాజ్యసభలో తీవ్ర దుమారాన్ని రేపగా, నేడు కూడా అదే పరిస్థితి నెలకొంది. చైర్మన్ వెంకయ్యనాయుడు లేచి నిలబడి పదే పదే విజ్ఞప్తి చేసినా, సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు పోడియంలోకి దూసుకొస్తుంటే, వారిని సముదాయించే ప్రయత్నం చేసిన వెంకయ్య, వారిని లెక్కబెట్టారు.

"ఒకటి, రెండు, మూడు, నాలుగు..." అంటూ పద్నాలుగు మందిని లెక్కించి, మీరు చేస్తున్న పనేం బాగాలేదని వ్యాఖ్యానించారు. ఒకేసారి ఇంతమంది నిరసనలేంటని, తాను ఎవరినీ అనుమతించనని, ఏదీ రికార్డుల్లోకి ఎక్కబోదని హెచ్చరించారు. ఆపై వెంకయ్యనాయుడు అమిత్ షాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వగా, ఆయన ప్రసంగాన్ని మాజీ మంత్రి ఆనంద్ శర్మ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరారు. అయినప్పటికీ సభ ఆర్డర్ లోకి రాకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు.

More Telugu News