దుబాయ్ లో జాక్ పాట్ కొట్టిన ఇండియన్!

01-08-2018 Wed 10:42
  • ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన సందీప్ మీనన్
  • 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ' లాటరీలో జాక్ పాట్
  • రూ. 7 కోట్ల డబ్బు ఖాతాలోకి
తన జీవితంలో ఏమీ సాధించలేకపోయానన్న బాధ ఆ చిరుద్యోగికి తీరింది. బతుకుదెరువు కోసం భారత్ నుంచి దుబాయ్ కి వెళ్లి కష్టాలు పడుతున్న వ్యక్తిని ధనలక్ష్మి వరించింది. కువైట్ లో ఉంటున్న సందీప్ మీనన్ అనే వ్యక్తి, 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ' నిర్వహించిన లాటరీలో ఏకంగా రూ. 7 కోట్ల లాటరీ కొట్టాడు.

తన జీవితంలో ఇంత డబ్బు చూడటం ఇదే తొలిసారని, తాను సాధించిన అతిపెద్ద విజయం కూడా ఇదేనని ఆనందంగా చెప్పుకున్నాడు. కాగా, ఇటీవలి కాలంలో దుబాయ్ లాటరీల్లో పలువురు ఇండియన్స్ కు జాక్ పాట్ తగులుతోంది. శాంతి బోస్ అనే యువకుడికి బీఎండబ్ల్యూ ఆన్ 90 స్క్రాంబ్లర్ కారు, 30 ఏళ్ల యువకుడికి 1.9 మిలియన్ యూఎస్ డాలర్లు, ఓ డ్రైవర్ కు లాటరీలో 12 మిలియన్ దిర్హామ్ తగిలాయి.