Honor Note 10: 8జీబీ ర్యామ్ తో ఆనర్ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ విడుదల!

  • చైనాలో విడుదలైన ఆనర్ నోట్ 10
  • భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ బ్యాకప్ 
  • త్వరలో భారత మార్కెట్లోకి 

ఆకట్టుకునే ఫీచర్లతో హువావే కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆనర్ నోట్ 10ను ఈరోజు చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ లో రెండేళ్ల క్రితం నోట్ 8ను విడుదల చేయగా, తాజాగా నోట్ 10ని విడుదల చేశారు. డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీలతో పాటు భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ బ్యాకప్ లతో ఈ ఫోన్ ని విడుదల చేశారు.

6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.27,000, 6జీబీ ర్యామ్,128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.32,000 ఉండే అవకాశం ఉంది. అలాగే, 8జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.36,000గా ఉండవచ్చు. మిడ్‌నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ కలర్ వేరియెంట్లలో లభించే ఈ ఫోన్ రేపటి నుండి చైనా మార్కెట్లో విక్రయించనున్నారు. అనంతరం భారత మార్కెట్లోకి రానుంది.

ఆనర్ నోట్ 10 ప్రత్యేకతలు:

  • 6.95" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే తో పాటు 2160×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (సూపర్ ఫాస్ట్ చార్జింగ్)
  • వెనక భాగంలో రెండు  24/16 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ

More Telugu News