priyamani: తల్లి కాబోతున్న ప్రియమణి?

  • ముస్తఫారాజ్ ను ప్రేమించి, పెళ్లాడిన ప్రియమణి
  • భర్తతో కలసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన ప్రియ
  • త్వరలోనే ఓ విషయాన్ని చెబుతానంటూ ఆసక్తిని రేకెత్తించిన వైనం

దక్షిణాది సినీరంగంలో గ్లామర్ తారగా రాణించిన ప్రియమణి... కెరీర్ బాగా ఉన్నప్పుడే ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ముస్తఫారాజ్ ను ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత  సినిమాలు చేయకపోయినా, బుల్లి తెరపై సందడి చేస్తోంది. తాజాగా తన భర్తతో కలసి ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతే కాదు, త్వరలోనే ఓ విషయాన్ని చెబుతానంటూ జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఫొటోను క్లియర్ గా గమనిస్తే... ఆమె గర్భవతి అయినట్టు కనిపిస్తోంది. ప్రియమణి తల్లి కాబోతోందని నెటిజన్లు ఓ అంచనాకు వస్తున్నారు. 

More Telugu News