pavan: రీమేక్ గా తమిళంలోకి 'అత్తారింటికి దారేది?'

  • తెలుగులో హిట్ కొట్టిన 'అత్తారింటికి దారేది?'
  • తమిళ రీమేక్ రైట్స్ తీసుకున్న లైకా 
  • త్వరలోనే పూర్తి వివరాలు    

పవన్ కల్యాణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'అత్తారింటికి దారేది' ఒకటిగా నిలిచింది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాలో, బొమన్ ఇరానీ .. నదియా కీలకమైన పాత్రలను పోషించారు. కథా కథనాలు .. మాటలు .. పాటల పరంగా ఈ సినిమా ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అలాంటి ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను తాజాగా లైకా ప్రొడక్షన్స్ వారు కొనుగోలు చేశారు. తమిళంలో ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించనున్నారు? నాయకా నాయికలుగా ఎవరు నటించనున్నారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.       

More Telugu News