chaitu: రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'శైలజా రెడ్డి అల్లుడు'

  • మారుతి దర్శకత్వంలో చైతూ 
  • రమ్యకృష్ణ కూతురు పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ 
  • ఆగస్టు 31వ తేదీన సినిమా రిలీజ్    

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించగా, కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. రీసెంట్ గా షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నారు. దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నిలువెల్లా అహంభావం కలిగిన అత్తగారి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. పొగరుబోతు కూతురిని సపోర్ట్ చేస్తూ .. అల్లుడిని ఆడించాలనుకుంటుంది. ఆమె ఆటలు సాగనీయని పాత్రలో చైతూ కనిపించనున్నాడు. గతంలో ఈ తరహా కథలు వచ్చినా .. ట్రీట్మెంట్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని మారుతి చెబుతుండటం విశేషం.             

More Telugu News