church: రేప్ కేసు వెనక్కి తీసుకుంటే ఇల్లు, పొలం ఇస్తా!: సన్యాసినికి చర్చి బిషప్ ఆఫర్

  • పోలీసులకు అందిన కాల్ రికార్డు
  • అందించిన బాధితురాలు
  • నెట్ లో వైరల్ గా మారిన ఆడియో

ఓ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారానికి పాల్పడ్డ చర్చి ఫాదర్  కేసు మాఫీ కోసం ఏకంగా మరో వ్యక్తితో ఫోన్ చేయించాడు. కేసును వెనక్కి తీసుకుంటే ఇల్లు, భూమి ఇస్తామనీ, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. అయితే ఈ కాల్ రికార్డును బాధితురాలు పోలీసులకు అందించింది. ప్రస్తుతం ఈ ఆడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.


జలంధర్ బిషప్ ఫ్రాంకో ముల్లకల్ 2014-16 మధ్య కాలంలో తనపై 13 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు(46)  తెలిపింది. బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నానంటూ తనపై ఆయన కేసు పెట్టడంతోనే, తాను పోలీసుల్ని ఆశ్రయించి, రేప్ కేసు పెట్టానని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో బాధితురాలికి మద్దతుగా నిలిచిన మరో సన్యాసినికి బిషప్ తరఫున ఓ మతాధికారి ఫోన్ చేశాడు. ఈ కేసును వెనక్కి తీసుకుంటే పెద్ద ఇల్లు, 10 ఎకరాల పొలం, ఆర్థిక సాయం చేస్తామని చెప్పాడు. ఒకవేళ కేసు వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కేసు వాపస్ తీసుకునేలా ఆమెను ఒప్పించాలని సూచించాడు.


ఈ ఆడియో క్లిప్ ను బాధితురాలు సోమవారం పోలీసులకు అందించింది. కాగా, ఈ ఘటనపై సన్యాసిని వాంగ్మూలం తీసుకున్నామనీ, త్వరలోనే కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.

More Telugu News