Shahid Afridi: షాహిద్ ఆఫ్రిది రికార్డును సమం చేసిన క్రిస్‌గేల్

  • బంగ్లాదేశ్‌పై ఐదు సిక్సర్లు బాదిన గేల్
  • గేల్ ఖాతాలో మొత్తం 476 సిక్సర్లు
  • ఆ తర్వాతి స్థానంలో మెకల్లమ్

విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ మరో రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కిన పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సరసన చేరాడు. 476 సిక్సర్లతో ఆఫ్రిది ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇప్పుడు గేల్ ఆ రికార్డును సమం చేశాడు.

సెయింట్ కిట్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో గేల్ ఈ ఘనత సాధించాడు. 38 ఏళ్ల ఎడమ చేతివాటం ఆటగాడైన గేల్ ఐదు సిక్సర్లు బాదాడు. ఫలితంగా అతడి ఖాతాలో మొత్తం 476 సిక్సర్లు చేరాయి. గేల్ టీ20ల్లో 103 సిక్సర్లు, వన్డేల్లో 275, టెస్టుల్లో 98 సిక్సర్లు కొట్టాడు. షాహిద్ ఆఫ్రిది, గేల్ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన మెకల్లమ్ ఉన్నాడు. అతడి ఖాతాలో మొత్తం 398 సిక్సర్లు ఉన్నాయి. టీమిండియా ఆటగాళ్లలో మాజీ సారథి ధోనీ 342 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

More Telugu News