america: అమెరికాలో కాల్పులకు తెగబడ్డ దుండగులు..ముగ్గురి మృతి!

  • న్యూ ఆర్లిన్స్ లో సంఘటన
  • కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మృతి
  • ఏడుగురికి గాయాలు

అమెరికాలోని న్యూఆర్లిన్స్ నగరంలో ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగర పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం, దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు క్షతగాత్రుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తమకు అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, కాల్పులకు పాల్పడిన దుండగులను గుర్తించాల్సి ఉందని చెప్పారు.

More Telugu News