Tollywood: నటి అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్యకు కారణమదేనా?

  • కీర్తికి రెండున్నరేళ్ల పాప
  • ఇప్పటికీ మాటలు రాకపోవడంతో స్పీచ్ థెరపీ
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కీర్తి

తన బిడ్డకు మాటలు రావడం లేదన్న మనస్తాపం, తీవ్రమైన ఒత్తిడితోనే ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అన్నపూర్ణ కుటుంబీకులు వెల్లడించారు. పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకున్న అన్నపూర్ణ, ఐదేళ్ల క్రితం రాయచూర్ కు చెందిన ఐటీ ఉద్యోగి వెంకట సాయికృష్ణకు ఇచ్చి వివాహం చేసింది.

వారికి రెండున్నరేళ్ల పాప ఉండగా, ఆ చిన్నారికి మాటలు ఇంకా రాలేదు. దీంతో వారు స్పీచ్ థెరపీని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీలోని దివ్యశక్తి అపార్ట్ మెంట్ లో వేర్వేరు ప్లాట్లలో అన్నపూర్ణ, కీర్తి ఉంటున్నారు. ఈ క్రమంలో తన బిడ్డ ఇంకా మాట్లాడటంలేదన్న దిగులుతో ఉన్న కీర్తి, ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News