nara rohith: 'వీర భోగ వసంత రాయలు' నుంచి శ్రీవిష్ణు ఫస్టులుక్

  • మల్టీ స్టారర్ మూవీగా 'వీర భోగ వసంత రాయలు'
  • నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ 
  • డిఫరెంట్ లుక్స్ తో ఆర్టిస్టులు  

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై మల్టీ స్టారర్ సినిమాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై వున్న మల్టీ స్టారర్ చిత్రాల జాబితాలో 'వీర భోగ వసంత రాయలు' ఒకటిగా కనిపిస్తోంది. ఇంద్రసేన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ నాలుగు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా కొంతసేపటి క్రితం శ్రీవిష్ణు పోస్టర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. తెల్లని గుర్రంతో కూడిన ఈ పోస్టర్ ఆయన పాత్రలోని కొత్తదనానికి అద్దం పడుతోంది. మొత్తానికి ఈ సినిమా పోస్టర్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరికి ఈ సినిమాను గురించి చర్చించుకునేలా చేస్తోంది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.          

More Telugu News