paruchuri gopalakrishna: 'సింహాద్రి' కథ అలా బాలకృష్ణ చేజారిపోయింది: పరుచూరి గోపాలకృష్ణ

  • బాలకృష్ణతో బి. గోపాల్ ఒక మూవీ చేయాలనుకున్నారు 
  • విజయేంద్ర ప్రసాద్ ఒక కథను ఇచ్చారు 
  • అనుకోకుండా మరో కథ లైన్లోకి వచ్చింది

సినీ రచయితలుగా పరుచూరి బ్రదర్స్ సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఎంతోమంది హీరోలు సాధించిన ఘన విజయాల్లో పరుచూరి బ్రదర్స్ పాత్ర ఎంతో వుంది. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాను గురించి ప్రస్తావించారు.

"పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా గురించిన ప్రస్తావన వస్తే, ముందుగా నాకు 'సింహాద్రి' సినిమా గుర్తుకు వస్తుంది. బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేయడానికి గాను విజయేంద్ర ప్రసాద్ గారు 'సింహాద్రి' కథను ఇచ్చారు. కథకి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి .. నేను సంభాషణలు రాయడం మొదలుపెట్టాను. అలా నేను డైలాగ్స్ రాసుకుంటూ ఉండగా బి.గోపాల్ వచ్చారు. నిర్మాత మేడికొండ మురళీకృష్ణకి వేరే కథ ఏదో దొరికిందట .. ఆ కథను చేయడానికి ఆయన బాలకృష్ణను కూడా ఒప్పించారట అని చెప్పారు. సరే .. మీ ఇష్టం అన్నాను నేను. అలా 'సింహాద్రి' కాకుండా బాలకృష్ణ 'పల్నాటి బ్రహ్మనాయుడు' చేశారు అని చెప్పుకొచ్చారు.  

More Telugu News