lunar eclipse: పున్నమి చంద్రుడు ఎరుపెక్కాడు.. రాగి వర్ణపు బ్లడ్ మూన్ అయ్యాడు!

  • ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసిన బ్లడ్ మూన్
  • తెల్లవారుజామున 3:49 గంటలకు వీడిన గ్రహణం
  • భూమికి అత్యంత చేరువగా కుజుడు

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది. శుక్రవారం రాత్రి 11.54 గంటలకు గ్రహణ స్పర్శ మొదలు కాగా, ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది. 1:43 గంటలపాటు కొనసాగిన చంద్రగ్రహణం తెల్లవారుజామున 3:49 గంటలకు వీడింది.  

మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2123లో సంభవిస్తుంది కాబట్టి చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. నిద్ర మానుకుని మరీ ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించారు. శాస్త్రవ్తేతలు పరిశోధనల్లో మునిగిపోయారు.

మధ్య ఆసియా నుంచి తూర్పు ఆఫ్రికా వరకు పలు దేశాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. చంద్రగ్రహణం సమయంలోనే మరో అద్భుతం ఆవిష్కృతమైంది.  శుక్రవారం రాత్రి కుజుడు.. భూమికి అత్యంత సమీపంగా 3.6 కోట్ల మైళ్ల దగ్గరగా వచ్చాడు.

More Telugu News