విమానం టాయిలెట్లో పిండం.. తనదేనన్న 19 ఏళ్ల ప్లేయర్!

27-07-2018 Fri 09:16
  • నెలలు నిండకుండానే మృత శిశువు జననం
  • విమానం టాయిలెట్లో పడిపోయిన పిండం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
గువాహటి నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఏషియా విమానంలోని టాయిలెట్‌ నుంచి పిండాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పిండం వయసును నిర్ధారించేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. టాయిలెట్‌లో పిండం పడి ఉన్న విషయాన్ని గుర్తించి విమాన సిబ్బంది వెంటనే విషయాన్ని వెల్లడించడంతో అది తనదేనని 19 ఏళ్ల తైక్వాండో ప్లేయర్ అంగీకరించింది.

గర్భం పోవడంతో పిండం పడిపోయిందని తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన అనంతరం ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. తైక్వాండో ప్లేయర్ నిజానికి నేడు తన కోచ్‌తో కలిసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.