Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మార్షల్ ఆర్ట్స్ టీచర్ పాత్రలో సమంత
  • చిరంజీవి 'సైరా' మేజర్ షెడ్యూల్  పూర్తి 
  • బుల్లితెరకు వస్తున్న నాటి నాయిక జయప్రద
  • తెలుగుతెరకు మరో నటుడి బయోపిక్

*  చెన్నయ్ బ్యూటీ సమంత తన తాజా చిత్రం 'సీమరాజా'లో సరికొత్త పాత్రను పోషిస్తోంది. తమిళ సంప్రదాయ సిలాంబం మార్షల్ ఆర్ట్స్ ను నేర్పించే టీచర్ గా ఇందులో ఆమె కనిపిస్తుంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పొనరం దర్శకత్వం వహిస్తున్నాడు.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం తాజా షెడ్యూలు ముగిసింది. దాదాపు 35 రోజుల పాటు హైదరాబాదులో జరిగిన ఈ షెడ్యూలులో ప్రధాన తారాగణం పాల్గొన్న సన్నివేశాలను దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రీకరించారు.
*  వెండితెర అందాలరాణిగా పేరుతెచ్చుకున్న ఒకప్పటి ప్రముఖ కథానాయిక జయప్రద తాజాగా బుల్లితెరకు వస్తోంది. హిందీలో ప్రసారం కాబోయే 'పర్ఫెక్ట్ పతి' టీవీ సీరియల్ లో ఆమె తల్లి పాత్రను పోషించనుంది.
*  జానపద హీరోగా పేరుతెచ్చుకున్న ప్రముఖ నటుడు దివంగత కాంతారావు బయోపిక్ ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రాదిత్య ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు దర్శకుడు పీసీ ఆదిత్య తెలిపారు.

More Telugu News