imrankhan: ఇరవై రెండేళ్ల తర్వాత నాకు అవకాశం దక్కింది: ఇమ్రాన్ ఖాన్

  • జిన్నా ఆశయాలు నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చా
  • రాజకీయాల్లో ఇరవై రెండేళ్లు పోరాడా
  • పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం బలపడుతోంది

పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, జిన్నా ఆశయాలు నెరవేర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయాల్లో ఇరవై రెండేళ్లు పోరాటం చేశానని, ఇప్పుడు తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించిందని అన్నారు. ఈ ఎన్నికల కోసం దేశ ప్రజలు ఎంతో త్యాగం చేశారని, ఈ ఎన్నికలు చారిత్రాత్మకమని ప్రశంసించారు.

పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం బలపడుతోందని, అవినీతి లేని పాలనను అందిస్తానని, పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల బాధ తీర్చడమే తన అజెండా అని చెప్పారు. పాకిస్థాన్ లో పెట్టుబడులకు విదేశీ సంస్థలను ఆహ్వానిస్తానని, పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఎంతో అవసరమని చెప్పారు. 

More Telugu News