kvp: ‘ప్రత్యేకహోదా’పై మరోసారి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాను!: కేవీపీ రామచంద్రరావు

  • ఏపీ విషయంలో బీజేపీ అబద్ధాలు చెబుతూనే ఉంది
  • ఓ అబద్ధాన్ని నిజమని నమ్మించాలని చూస్తోంది
  • రాబోయే యూపీఏ ప్రభుత్వంలో ‘హోదా’ను సాధిస్తాం 

విభజన అంశాలు, హామీలు అమలు చేయాలని కోరుతూ రాజ్యసభలో మరోసారి ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టానని, రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలు సహా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడంపై చర్చిస్తామని చెప్పారు.

ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ విషయంలో మొదటి నుంచి బీజేపీ అబద్ధాలు చెబుతూనే ఉందని, వందసార్లు ఓ అబద్ధాన్ని చెప్పి.. నిజమని నమ్మించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ‘ప్రత్యేకహోదా’ను రద్దు చేశామన్న అంశం లేదని, ‘హోదా’ కోసం మొదటి నుంచి పోరాడుతోంది కాంగ్రెస్సే అని అన్నారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని, రాబోయే యూపీఏ ప్రభుత్వంలో ‘హోదా’ను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

More Telugu News