Japan: ఘోరకలికి పాల్పడిన ఆరుగురిని ఈ ఉదయం ఉరేసిన జపాన్!

  • 1995లో 'సరిన్ దాడి'
  • తీవ్రంగా గాయపడిన 6 వేల మంది
  • ఈ నెలారంభంలో ఆరుగురు, నేడు మరో ఆరుగురికి శిక్ష అమలు

1995లో టోక్యోలోని సబ్ వేలో ఆరు రైళ్లపై రసాయన దాడులకు పాల్పడి, విషపూరితమైన 'సరిన్' వాయువును వదిలి 13 మంది ప్రాణాలు తీసి, 6 వేల మందిని తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటనలో ఈ ఉదయం ఆరుగురు దోషులకు జపాన్ అధికారులు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ న్యాయ శాఖ మంత్రి యోకో కమీకవా ధ్రువీకరించారు.  

1984లో అంధుడైన షోకో అసహారా అనే వ్యక్తి ఓమ్ షిన్రిక్యో అనే కొత్త మతాన్ని ఏర్పరచి, వేల సంఖ్యలో అనుచరులను తయారు చేసుకుని, తన ప్రవచనాలతో మారణ హోమానికి పురికొల్పగా, అప్పట్లో ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెలారంభంలో షోకో అసహారా సహా మరో ఆరుగురిని ఉరితీసి చంపిన జపాన్, నేడు మరో ఆరుగురికి శిక్షను అమలు చేసింది. 2004లో కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయగా, జపాన్ లో ఉరి రద్దుపై యోచిస్తున్న ప్రభుత్వం, శిక్ష అమలును వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి సరిన్ దాడి బాధిత కుటుంబాల నుంచి వస్తున్న ఒత్తిడితో ఉరి అమలుకే మొగ్గు చూపింది.

More Telugu News