Monsoons: తెలుగు రాష్ట్రాలలో 29 వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు: వాతావరణ శాఖ

  • మందగించిన రుతుపవనాలు
  • ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనానికి చాన్స్
  • గ్రేటర్ పరిధిలో వర్షాలు కురిసే అవకాశం స్వల్పమే
  • వెల్లడించిన వాతావరణ శాఖ

రుతుపవనాలు మందగించడంతో పాటు గాలిలో తేమ శాతం తగ్గడంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయని, ఇదే సమయంలో వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

 ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని చెుప్పిన అధికారులు, వాయవ్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో ఓ అల్పపీడనం కేంద్రీకృతమైందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉందని తెలిపారు. దీని ప్రభావం తెలంగాణపై స్పష్టంగా ఉంటుందని, అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం వర్షాలు కురిసే అవకాశాలు స్వల్పమేనని, కొన్ని చోట్ల చెదురు మదురు జల్లులు పడొచ్చని తెలిపారు. అల్పపీడనం ఏర్పడితే కోస్తాంధ్ర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలకు చాన్స్ ఉందని పేర్కొన్నారు.

More Telugu News