gurajala: మైనింగ్ ఆరోపణలు.. ఎమ్మెల్యే యరపతినేనికి హైకోర్టు నోటీసులు

  • హైకోర్టులో ఈరోజు విచారణ
  • అధికారులపైనా మండిపడ్డ ఉన్నత న్యాయస్థానం
  • సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖను ప్రతివాదులుగా చేర్చిన వైనం

ఏపీలోని గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. యరపతినేనిపై వచ్చిన మైనింగ్ ఆరోపణలపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మైనింగ్ కు పాల్పడుతున్న వారి నుంచి డబ్బు వసూలు చేయకుండా మౌనంగా ఉన్నారంటూ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో యరపతినేనిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ తో దర్యాప్తు జరిపిస్తామని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.  

More Telugu News