sharwanand: 'పడి పడి లేచె మనసు' రిలీజ్ డేట్ ఖరారు

  • శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచె మనసు' 
  • కథలో మార్పులు .. చేర్పులు 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల

శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. శర్వానంద్ .. సాయిపల్లవితో హను రాఘవపూడి సెట్స్ పైకి వెళ్లి చాలా రోజులైంది.

ఈ మధ్య వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల వచ్చిన 'తేజ్ ఐ లవ్ యూ' లోని ఓ పాయింట్ కి .. ఈ సినిమాలోని పాయింట్ కి మధ్య దగ్గర పోలికలు వున్నాయనే టాక్ వచ్చింది. దాంతో కథలో మార్పులు చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నాడనీ .. విడుదల విషయంలో జాప్యం జరగవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయాలను అలా ఉంచితే .. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇచ్చేసి ఈ సినిమా టీమ్ ఒక స్పష్టతను తీసుకొచ్చింది. 

More Telugu News