kavitha: కవితగారు.. మీ ఛాలెంజ్ ను స్వీకరించా: దర్శకుడు రాజమౌళి

  • రాజమౌళికి హరితహారం ఛాలెంజ్ ను విసిరిన కవిత
  • మూడు మొక్కలను నాటిన రాజమౌళి
  • కేటీఆర్, పుల్లెల గోపీచంద్ లను నామినేట్ చేసిన దర్శక దిగ్గజం

టీఆర్ఎస్ ఎంపీ కవిత విసిరిన హరితహారం ఛాలెంజ్ ను సినీ దర్శకుడు రాజమౌళి స్వీకరించారు. మొక్కలను నాటారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'కవితగారు మీ చాలెంజ్ ను స్వీకరించా. మర్రి, గుల్మొహర్, వేప మొక్కలను నాటా. పుల్లెల గోపిచంద్, కేటీఆర్, దర్శకులు సందీప్ వంగ, నాగ్ అశ్విన్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తాను మొక్క నాటుతున్న ఓ ఫొటోనే అప్ లోడ్ చేశారు.

More Telugu News