Danushaka Gunathilaka: శ్రీలంక క్రికెటర్ గదిలో నార్వే మహిళపై అత్యాచారం.. ఓపెనర్‌పై వేటు!

  • గుణతిలక గదికి అమ్మాయిలను తెచ్చిన స్నేహితుడు
  • తనపై అత్యాచారం జరిగిందంటూ యువతి ఫిర్యాదు
  • ఓపెనర్ స్నేహితుడి అరెస్ట్

దక్షిణాప్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ధనుష్క గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటేసింది. గుణతిలక బస చేసిన హోటల్ గదిలోకి అతడి స్నేహితుడు ఇద్దరు నార్వే మహిళలను తీసుకొచ్చాడు. అందులో ఓ మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలున్నాయి.

గుణతిలక స్నేహితుడు తనపై అత్యాచారం చేసినట్టు ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన శ్రీలంక బోర్డు ప్రాథమిక విచారణ చేపట్టింది. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడని తేలడంతో గుణతిలకను సస్పెండ్ చేసింది. ఈ సిరీస్‌లో చక్కని ఫామ్‌లో ఉన్న గుణతిలక జట్టుకు దూరం కావడంతో శ్రీలంకకు ఎదురుదెబ్బేనని క్రీడా పండితులు చెబుతున్నారు.

More Telugu News