Rwanda: రువాండాలో ఏముంది?.. ఢిల్లీ అంతకూడా లేని దేశానికి భారత ప్రధాని!

  • వేగంగా అభివృద్ధి చెందుతున్న రువాండా 
  • మోదీ రెండు రోజుల పర్యటన
  • 200 గోవులను బహుమతిగా ఇవ్వనున్న మోదీ

ఢిల్లీ నగర జనాభా కంటే తక్కువ ఉన్న రువాండా దేశం ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఒక్క రోజు తేడాతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడ పర్యటించడమే అందుకు కారణం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా దేశాల్లో రువాండా ఒకటి. ఆదివారం జిన్‌పింగ్ అక్కడ పర్యటించి ఆ దేశాన్ని సందర్శించిన తొలి చైనా అధ్యక్షుడిగా రికార్డులకెక్కగా, తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.

ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా రువాండా చేరుకున్న ప్రధాని మోదీ, ఆ దేశాధ్యక్షుడు పాల్ కగామేతో భేటీ అయ్యారు. రెండు రోజులపాటు అక్కడ పర్యటించనున్న మోదీ పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ముఖ్యంగా రువాండాలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో రూ.6 8,960 కోట్లు, వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో మరో రూ. 68,960 కోట్ల పెట్టుబడులకు భారత్‌ ముందుకొచ్చింది. అలాగే, వాణిజ్య, రక్షణ సంబంధ ఒప్పందాలపైనా ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఆ దేశంలోని రువేరు ఆదర్శ గ్రామాన్ని సందర్శించి 200 గోవులను బహుమతిగా ఇవ్వనున్నారు. ఆదివారం రువాండాను సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

More Telugu News