26/11 attacks: ముంబై దాడుల వ్యూహకర్త డేవిడ్ హేడ్లేపై తోటి ఖైదీల దాడి.. పరిస్థితి విషమం

  • షికాగో జైలులో శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ హేడ్లే
  • హేడ్లేపై ఇద్దరు ఖైదీల దాడి.. తీవ్రంగా గాయాలు
  • ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు

ముంబై దాడుల (26/11) వ్యూహకర్త డేవిడ్ హేడ్లేపై దాడి జరిగింది. అమెరికాలోని షికాగో జైలులో శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ హేడ్లీపై ఇద్దరు ఖైదీలు దాడి చేశారు. ఈ దాడిలో హేడ్లే తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కాగా, పాకిస్థాన్ సంతతికి చెందిన డేవిడ్ హేడ్లే అమెరికావాసి. ముంబైలో 2008 నవంబర్ 26న లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు హేడ్లే వ్యూహకర్తగా వ్యవహరించినట్టు నిరూపణ కావడంతో షికాగో కోర్టు అతనికి ముప్పై ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది.  

More Telugu News