raviteja: శ్రీను వైట్ల మూవీపై సునీల్ గట్టి ఆశలే పెట్టుకున్నాడట!

  • హీరోగా సక్సెస్ కి దూరమైన సునీల్ 
  • 'అమర్ అక్బర్ ఆంటోని'లో కమెడియన్ 
  • గతంలో శ్రీను వైట్ల సినిమాల్లో మంచి పాత్రలు  

కమెడియన్ గా సునీల్ ఒక వెలుగు వెలిగాడు. ఆ క్రేజ్ కారణంగానే ఆయనకి హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆరంభంలో విజయాలు పలకరించినా, ఆ తరువాత ఆయనని సక్సెస్ అనేది పలకరించకుండా పోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన కమెడియన్ గా ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించేసుకున్నాడు. అలా ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు.

శ్రీను వైట్ల సినిమాల్లో కామెడీ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో గిలిగింతలు పెడతాయనేది తెలిసిందే. గతంలో శ్రీను వైట్ల తన 'దుబాయ్ శీను' .. 'ఢీ' .. 'రెడీ' సినిమాల్లో సునీల్ కి మంచి పాత్రలు ఇచ్చాడు. ఆసాంతం పడి పడి నవ్వించే ఆ పాత్రలు సునీల్ కి ఒక రేంజ్ లో పేరు తెచ్చిపెట్టాయి. 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలోను ఆయన సునీల్ కి కడుపుబ్బా నవ్వించే క్యారెక్టర్ ఒకటి ఇచ్చాడట. ఈ పాత్రతో కమెడియన్ గా సునీల్ మళ్లీ తన హవాను కొనసాగిస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ పాత్రపైనే సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడట. మరి ఆయన ఆశలు ఈ సినిమాతో ఫలిస్తాయేమో చూడాలి.  

More Telugu News