Venkaiah Naidu: రాజ్యసభలో ఏపీ సభ్యుల ఆందోళన.. వెంకయ్యనాయుడి ఆదేశాలతో ఆగిపోయిన ప్రత్యక్షప్రసారం!

  • ఆందోళన కొనసాగించిన టీడీపీ, వైసీపీ సభ్యులు 
  • ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు
  • సభ రేపటికి వాయిదా 

ఏపీకి న్యాయం చేయాలంటూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యసభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారించినా వారు వెనక్కి తగ్గలేదు. వెల్ లోకి దూసుకొచ్చిన టీడీపీ ఎంపీలు... ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక వైసీపీ ఎంపీలు వారి స్థానాల్లో నుంచే నిరసన వ్యక్తం చేశారు.

దీంతో, మీ గోల ఎవరూ వినడం లేదని, మీ ఆందోళనను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇంకా ఎందుకు అరుస్తారంటూ వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ప్రసారాలను ఆపివేయాలంటూ ఆదేశించారు. దీంతో, కొద్ది సేపు టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. ఆ తర్వాత సభ ప్రారంభమైన కాసేపటికి సభను రేపటికి వాయిదా వేశారు. విభజన హామీలపై రేపు స్వల్పకాలిక చర్చను చేపట్టనున్నారు.

More Telugu News