nagachaitanya: అభిమానులకు శుభవార్త .. సమంత - చైతూ జంటగా కొత్త సినిమా లాంచ్

  • శివ నిర్వాణ దర్శకుడిగా కొత్త చిత్రం 
  • దర్శకుడికి స్క్రిప్ట్ అందజేసిన నాగ్
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్  

పెళ్లి తరువాత సమంత .. చైతూలను తెరపై జంటగా చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. అయితే కథ కుదరకపోవడం వలన ఈ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల దర్శకుడు శివ నిర్వాణ వినిపించిన కథ నచ్చడంతో, సమంత .. చైతూ ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అనే ఆత్రుత అందరిలోనూ మొదలైంది.ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుని .. లాంఛనంగా షూటింగును మొదలుపెట్టేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున .. తన చేతుల మీదుగా దర్శకుడు శివ నిర్వాణకి స్క్రిప్ట్ ను అందజేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో చైతూ .. సమంత భార్యభర్తలుగా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హిట్ కాంబినేషన్ కావడం వలన .. 'నిన్నుకోరి' తరువాత శివ నిర్వాణ చేస్తోన్న ప్రాజెక్టు కావడం వలన సహజంగానే అంచనాలు వున్నాయి.  

More Telugu News