Telangana: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా.. కాసుకోండి!: గద్దర్

  • పోరాటానికి ప్రతిరూపమే ఓటు
  • పార్టీ ఏర్పాటుపై నెల రోజుల చర్చ
  • ఆగస్టులో పది లక్షల మందితో సభ

ప్రజా గాయకుడు గద్దర్ కీలక ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఓటు అనేది ఒక పోరాట రూపమన్న ఆయన నేడది కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిందన్నారు. పార్టీ పెట్టే అంశంపై రాజకీయ నిపుణులతో చర్చించనున్నట్టు తెలిపారు. ప్రతీ పల్లెకు వెళ్లి ప్రజలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. కళాశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకునేందుకు చర్చా వేదికలు నిర్వహిస్తానన్నారు. వారంతా ఏది నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

‘బహుజన రాజ్యాధికారమే లక్ష్యం’ పేరుతో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభిమానులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు నెలాఖరులో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ మేనిఫెస్టోను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వేములవాడలో సభ నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచన ఉందన్నారు. సోమవారమే తాను ఓటు కోసం నమోదు చేసుకోనున్నట్టు సభా ముఖంగా గద్దర్ తెలిపారు.

More Telugu News