Chandrababu: ‘అవిశ్వాసం’ వీగిపోయిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారు?: వైసీపీ నేత భూమన

  • బీజేపీకి కృతఙ్ఞతలు చెప్పడానికి వెళ్లారా?
  • కొత్త పొత్తుల కోసం వెళ్లారా?
  • హోదాపై చంద్రబాబు తీసుకున్నది ఏ ‘టర్న్’?

‘అవిశ్వాసం’ వీగిపోయిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారు? అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి కృతఙ్ఞతలు చెప్పడానికి వెళ్లారా? కొత్త పొత్తుల కోసం వెళ్లారా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీసుకున్నది ఏ ‘టర్న్’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ప్యాకేజీయే మంచిదని సీఎంవో పుస్తకాలు కూడా ప్రచురించిన విషయాన్ని ప్రస్తావించారు.

 అవిశ్వాసంలో పక్క రాష్ట్రాలను కూడా బాబు మేనేజ్ చేయలేకపోయారని విమర్శించారు. ‘అవిశ్వాసం’పై కలిసి రావాలని వైసీపీ పిలుపునిస్తే పట్టించుకోలేదని, ఇప్పుడు కంటితుడుపు చర్యగా చంద్రబాబు అవిశ్వాసం పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలను రాజ్ నాథ్ బయటపెట్టారని, టీడీపీ వైసీపీ ట్రాప్ లో పడుతోందని సాక్షాత్తూ ప్రధానే అన్నారంటే దాని అర్థమేంటి? చంద్రబాబు బీజేపీ మిత్రుడు కనుకే మోదీ అలా చెప్పారని విమర్శించారు. జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా వాస్తవాలను మాత్రం ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు నైజాన్ని ఖండిస్తూ ఈ నెల 24న బంద్ ను జయప్రదం చేయాలని భూమన పిలుపు నిచ్చారు.

More Telugu News