madhav: వైసీపీ సహకరిస్తే.. టీడీపీపై అవిశ్వాసం: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • లోక్ సభలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది
  • రాజీనామాలు చేసి వైసీపీ పనికిరాని పక్షంగా మిగిలిపోయింది
  • అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడం దారుణం

బీజేపీపై బురద చల్లేందుకు లోక్ సభలో టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అవిశ్వాసం వీగిపోవడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు.

టీడీపీ, కాంగ్రెస్ ల స్నేహ బంధానికి లోక్ సభ వేదికగా నిలిచిందని అన్నారు. రాజీనామాలు చేసి పనికిరాని పక్షంగా వైసీపీ మిగిలిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యేలుగా ప్రజలు ఎన్నుకుంటే... పోరాటం సాగించకుండా, అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడం దారుణమని అన్నారు. వైసీపీ సహకరిస్తే, టీడీపీపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధమని చెప్పారు. 

More Telugu News