amit shah: అమిత్ షా సభ్యుడిగా 1800 వాట్సాప్ గ్రూపులు!

  • 2019 ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు
  • సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న బీజేపీ
  • మండల స్థాయి కార్యకర్తల వరకు వాట్సాప్ లో అనుసంధానం

2019 ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. పార్టీకి సంబంధించిన విషయాలను ప్రచారం చేసుకునేందుకు, ప్రత్యర్థుల దుష్ప్రచారాలను ఎత్తి చూపేందుకు సోషల్ మీడియాను బీజేపీ ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో 1800లకు పైగా వాట్సాప్ గ్రూపులను బీజేపీ సృష్టించింది. ప్రతి గ్రూపులో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మెంబర్ గా ఉన్నారు.

2019 ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ నుంచి మండల స్థాయి వరకు పార్టీ మద్దతుదారులను వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా బీజేపీ అనుసంధానిస్తోంది. ఇందులో వాట్సాప్ కూడా ఒకటి. బీజేపీ మీడియా రిలేషన్స్ హెడ్ నీల్ కాంత్ భక్షి మాట్లాడుతూ, పార్టీకి చెందిన ఆఫీస్ బేరర్లను, కార్యకర్తలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 1800లకు పైగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశామని... ఈ సంఖ్యను మరింతగా పెంచుతున్నామని తెలిపారు. పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పార్టీ సభ్యులతో నేరుగా పంచుకోవడానికి, ఫేక్ న్యూస్ లను వివరించడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటామని చెప్పారు. 

More Telugu News