దేశంలోనే తొలిసారి... యాదగిరిగుట్ట దేవాలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్

22-07-2018 Sun 07:23
  • అరుదైన ఘనతను సొంతం చేసుకున్న యాదాద్రి
  • ఇండియాలో తొలిసారి ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్
  • అభినందనలు తెలిపిన కేసీఆర్
తెలంగాణలో లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదాద్రి అరుదైన ఘనతను సాధించింది. ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించిన తొలి దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. పర్యావరణ పరిరక్షణ, భద్రత, ఆలయ నిర్వహణలో సేవలకు గుర్తింపునిస్తూ ఈ సర్టిఫికెట్ జారీ అయింది. ఇండియాలో ఇలా ఓ ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం ఇదే తొలిసారి. ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడంపై కేసీఆర్ స్పందించారు. ఇది అధికారుల శ్రమకు నిదర్శనమని అన్నారు. ఆలయ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఐఎస్ఓ 2001-2015 గుర్తింపును కేసీఆర్ స్వయంగా దేవస్థానం ఈఓ, ఇతర అధికారులకు అందించారు.