nellore: నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ హెచ్చరిక

  • తీర ప్రాంతాల్లో ఎగసిపడనున్న అలలు
  • కోస్తా తీరం వెంబడి గాలులు వీచే అవకాశాలు
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

ఏపీలోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల తీర ప్రాంతవాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువ మధ్య తీరంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపటి వరకు సముద్రంలో 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాల యంత్రాగాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సంబంధిత అధికారులు హెచ్చరించారు. 

More Telugu News