amaravathi: అమరావతి వల్ల ఏపీ కంటే కేంద్రమే ఎక్కువ లాభపడుతుంది: చంద్రబాబు

  • అమరావతికి ఇచ్చిన నిధులతో కేబుల్ వర్క్ కూడా చేయలేం
  • ఇలా అవమానించడం సరికాదు
  • మంజూరు చేసిన నిధులను కూడా వెనక్కి తీసుకుంటున్నారు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లు ఇచ్చామని లోక్ సభలో ప్రధాని మోదీ చెప్పారని... ఆ డబ్బుతో కనీసం కేబుల్ వర్క్ కూడా పూర్తి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఢిల్లీకన్నా మెరుగైన రాజధానిని నిర్మిస్తామని చెప్పిన మోదీ... ఇంత తక్కువ నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రూ. 1500 కోట్లతో ఢిల్లీలాంటి నగరాన్ని నిర్మించగలమా అని అడిగారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికన్నా కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ లాభమని చెప్పారు.

నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల పలు రకాల ట్యాక్స్ ల ద్వారా కేంద్రానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఏపీకి కేంద్రం సాయం చేయాలే కాని, ఇలా అవమానించడం సరికాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 57 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. ఏపీకి మంజూరు చేసిన నిధులను కూడా వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. లోక్ సభలో టీడీపీ ఎంపీలు అద్భుతంగా పోరాడారని కితాబిచ్చారు.


More Telugu News