ntr: 'జై లవ కుశ'కు అరుదైన గౌరవం!

  • బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవ కుశ'
  • బుచీయోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు
  • కథాకథనాలు .. పాత్రల్లోని వైవిధ్యం కారణం

ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'జై లవ కుశ' ముందుగా కనిపిస్తుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవాన్ని సంపాదించుకుంది. నార్త్ కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు రోజుల ప్రదర్శనకి గాను 'జై లవ కుశ' సినిమాను ఎంపిక చేశారు.

 ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో 'జై లవ కుశ' కి ఈ గౌరవం దక్కింది. ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా 'జై లవ కుశ' కావడం విశేషం. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం .. మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించడం .. పాత్రల్లోని వైవిధ్యం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ హైలైట్స్ ఈ సినిమాకి ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.  

More Telugu News