Jagan: అది వైఎస్ఆర్ ట్రాప్ కాదన్నా... ట్రాక్ అనుకోవాలి!: జగన్

  • వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడిపోయిందన్న ప్రధాని
  • తాము నాలుగున్నరేళ్లుగా పోరాడుతున్నామన్న జగన్
  • ఒత్తిడి వచ్చేసరికి టీడీపీ ట్రాక్ మార్చుకుందని ఎద్దేవా

"తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాప్ లో పడిపోయింది" అని నిన్న లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా, వైఎస్ జగన్ స్పందించారు. "ఇంతకుముందు చెప్పినదే అన్నా. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగున్నర సంవత్సరాలుగా మేము చెబుతున్నదే. అభిజిత్ సేన్ రాసిన లేఖ, వైవీ సుబ్బారెడ్డి రాసిన లేఖ, ఈ జీఎస్టీలో స్పెషల్ ప్రొవిజన్స్... ఇవన్నీ చూపిస్తూ నాలుగేళ్లుగా పోరాటం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం.

ఈ చంద్రబాబునాయుడు గారికి, ఇప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసరికి, ఎన్నికలు దగ్గర పడేసరికి... టీడీపీ కూడా ట్రాక్ మార్చింది అని ఆయన అన్నాడు. ట్రాక్ మార్చింది... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడింది అనేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తావుంది. నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉన్న డిమాండ్ నే చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో తాను కూడా మోయక తప్పలా. అది వాళ్లకు ఒక ట్రాప్ మాదిరిగా కనిపిస్తా వుంది. అదే ప్రస్తావన వాళ్లు చేశారన్నా" అని అన్నారు.

More Telugu News